Latest Events

Stay informed about our upcoming programs, activities, and special gatherings that bring our community together.

నటుడు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘మనం సైతం’ ఫౌండేషన్ పుష్కర మహోత్సవం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో ఘనంగా జరిగింది. పన్నెండేళ్లుగా సమాజ సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఈ ఫౌండేషన్‌కు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. నిరంత‌రం కాదంబరి కిరణ్ చేస్తున్న‌ సేవలను పలువురు కొనియాడారు.
స్త్రీ ఆరోగ్యమే సమాజ సౌభాగ్యం! ప్రాణాలు కాపాడే డాక్టర్లు,వారి సిబ్బంది..దేవుళ్ళే ! స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా *స్త్రీలు కాన్సర్ బారినపడకుండా కాపాడే ప్రయత్నంలో *మనం సైతం కాదంబరి ఫౌండేషన్* తోడుగా *మెడికవర్* ఆసుపత్రి వారు ఆరంభించిన అద్భుత *ఫ్రీ కాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రాం* కి ముఖ్య అతిధిగా పాల్గొనటం నా అదృష్టం.
స్త్రీ ఆరోగ్యమే సమాజ సౌభాగ్యం! ప్రాణాలు కాపాడే డాక్టర్లు,వారి సిబ్బంది..దేవుళ్ళే ! స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా *స్త్రీలు కాన్సర్ బారినపడకుండా కాపాడే ప్రయత్నంలో *మనం సైతం కాదంబరి ఫౌండేషన్* తోడుగా *మెడికవర్* ఆసుపత్రి వారు ఆరంభించిన అద్భుత *ఫ్రీ కాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రాం* కి ముఖ్య అతిధిగా పాల్గొనటం నా అదృష్టం.
మదర్ థెరిస్సా జయంతి సందర్భంగా కళానిలయం వారి హ్యుమానిటీ అవార్డు పె.వేణుగోపాలచారి వంటివారి చేతులపై అందుకోవటం మనం సైతం కుటుంబానికి సగర్వం.
“మనం సైతం” కాదంబరి కిరణ్ తమ కుమార్తె వివాహ మహోత్సవానికి రావలసిందిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు, పె.శ్రీ.కెసిఆర్ గారిని ఆహ్వానిస్తూ,శుభలేఖను అందించడం జరిగింది.ఈ సందర్భంగా “మనం సైతం” ద్వారా సమాజహితం కొరకు నిరంతరం చేస్తున్న సేవా కార్యక్రమాలను శ్రీ కెసిఆర్ గారికి వివరించి వారి ఆశీస్సులను పొందటం జరిగింది.
హరిషన్న ని కలిస్తే ఆ ధైర్యమే వేరు! ఆయనకి సమస్యలు వినడంలో సహనం,పరిష్కారాలలో వేగం చాల ఎక్కువ.
రెబల్ స్టార్ కృష్ణంరాజు గారిని ఈరోజ కలసి మనం సైతం-సపర్య we care for uncared ఆశ్రమం గురించి, మరియూ సర్వశ్రీ VVవినాయక్, చదలవాడ శ్రీనివాసరావు,C కళ్యాణ్ ,జెమినీ కిరణ్,కొరటాల శివ ,తిరుమలరెడ్డి, గార్ల తో జరిగిన సమావేశం గురించి .. సవివరంగా తెలియచేసి వారి ఆశీస్సులు అందుకోవడం జరిగిందండి!
*మహిళలకు కాన్సర్ రాకూడదు* *మనం సైతం* ఆధ్వర్యంలో.. మహిళలలో కాన్సర్ లక్షణాలను ముందుగా గుర్తించే వైద్య పరీక్షల ను సుమారు(4,000/-విలువ చేసే పరీక్షలు)కేవలం 500/- కే చేయడం జరుగుతుంది. డా.రమేష్ మాటూరి, గైనకాలజిస్ట్ డా.బబిత మాటూరి నెలకొల్పిన *పారిజాతం* క్లినిక్స్ ను సంప్రదించి వైద్య సాయం పొందండి. మీరు సంప్రదించాల్సిన వారు. *పారిజాతం * ఉమెన్స్ క్లినిక్ ఫోన్:8977507505. స్థలం:రత్నదీప్ పైన, పైప్ లైన్ రోడ్,పుప్పాలగూడ. ఈ వైద్య పరీక్షల బ్రోచర్ విడుదల చేసిన Mla శ్రీ ప్రకాష్ గౌడ్, రామకృష్ణారెడ్డి, రేఖ, పద్మజ, అనిత నిమ్మగడ్డ తదితర నాయకులు.
మా హీరో కృష్ణ గారిని అల్లూరి సీతారామరాజు జయంతి నాడు కలసి మనం సైతం-సపర్య we care for uncared ఆశ్రమం గురించి సవివరంగా తెలియచేసి వారి ఆశీస్సులు అందుకోవడం జరిగిందండి!
భారతీయ సినీ దర్శక దిగ్గజం శంకర్ (తమిళ్)గారి సినిమాలో ఒక్కసారి కనబడితే చాలనుకునేవాడిని. మంచి వేషం ఇచ్చారు.థాంక్యూ వెరీమచ్ సర్
మనం సైతం కి రెండు ఉగాది పురస్కారాలు IKON వారి”కళా విశిష్ట”, తెలుగు సినిమా వేదిక వారి “సేవా రత్న”. ముకుళిత హస్తాలతో .. మనం సైతం కుటుంబం.
గాంధీ అన్నని కలిస్తే MLA ని కలిసినట్టు ఉండదు,ఓ ఆత్మీయుడిని కలిసినట్టుంటుంది. మూర్తి గారయితే ఆత్మ బంధువే!
ఆంధ్రప్రదేశ్ చీరాల సమీపం లోని తోటవారిపాలెం లో పేదలకొరకు “మనం సైతం” ఆధ్వర్యంలో రమేష్ రాజా నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఉచితంగా ఎన్నో రకాల మందులను ఇంజక్షన్ లను అందించడం జరిగింది. ..ఆ పరిసర గ్రామాలకు కూడా ఉచిత వైద్య, అంబులెన్సు సౌకర్యాలు కలిగించిన “రమేష్ రాజా”టీం కి ప్రజల అభినందనలు ఆశీస్సులు పెద్ద ఎత్తున లభించాయి. కనకదుర్గమ్మ దయతో చేతనైన సాయంకోసం ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరికైనా “మనం సైతం”!!
నాలో సేవా ధైర్యాన్ని,సేవా తెగింపునీ,సేవా విశ్వాసాన్ని రెట్టింపుచేస్తూ,నన్ను ఆదరిస్తూ,నిరంతరం నా వెన్నంటి నిలచే పెద్దలలో ముఖ్యలు మా సంతన్న కి మనసారా చెప్తున్నా ..కృతజ్ఞతలు!
ఈరోజు ‘మనం సైతం’కుటుంబం అమ్మపల్లి సీతారామాలయం (నర్కూడ గ్రామం)శంషాబాద్ నకు సీసీ కెమెరాలు ఆలయ కమిటీ,అర్చకస్వామి వారికి అందించడం జరిగింది. రుద్రరాజు రమేష్ మనం సైతం కాదంబరి కిరణ్.